Yemaindho Teliyadu Naaku lyrics

Songs   2024-12-24 21:15:33

Yemaindho Teliyadu Naaku lyrics

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నీ పేరే పాటయ్యింది పెదవులకు

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు

ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు

నా పరిచయం వరమని పొగిడి చంపకు

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నీ పేరే పాటయ్యింది పెదవులకు

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు

ఏ పువ్వుని చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తోందే

ఎవరైనా కోస్తుంటే మరి గొడవైపోతుందే

ఏ దారిన వెళుతూ ఉన్నా నువ్వెదురొస్తున్నట్టుందే

ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే

విడి విడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఈ తంటా

ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నీ పేరే పాటయ్యింది పెదవులకు

నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు

కాస్తైనా చెప్పను ఆ వివరం నీకు

కనుపాపలు రెండున్నాయి

చిరు పెదవులు రెండున్నాయి

నా పక్కన వుంటావా

నా రెండో మనసల్లే

ఆ తారలు ఎన్నున్నాయి

నా ఊహలు అన్నున్నాయి

నా వెంటే వస్తావా

నిజమయ్యే కలలల్లే

ఇప్పటి వరకు పాదం వేసిన అడుగుల్నే చూశాను

నడకే తెలియక ముందర నుంచే నీ వైపే వస్తున్నాను

ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు

నీ పేరే పాటయ్యింది పెదవులకు

నీకేమైందో తెలిసెను నాకు ఏమైందో తెలిసెను నాకు

నిన్నిట్టా చూస్తుంటే బావుంది నాకు

  • Artist:Karthik
  • Album:Middle Class Abbayi
See more
Karthik more
  • country:India
  • Languages:Telugu, Tamil, Hindi
  • Genre:Singer-songwriter, Opera
  • Official site:http://www.karthiksinger.com
  • Wiki:http://en.wikipedia.org/wiki/Karthik_(singer)
Karthik Lyrics more
Karthik Featuring Lyrics more
Karthik Also Performed Pyrics more
Excellent Songs recommendation
Popular Songs
Copyright 2023-2024 - www.lyricf.com All Rights Reserved